నేటి నుంచి తెలంగాణలో ‘ప్రజావాణి’ కార్యక్రమం

  • ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం
  • సమస్యలపై ప్రజల అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు
  • కార్యక్రమంపై తరచూ సమీక్ష జరగాలంటున్న ప్రజలు
  • జిల్లా స్థాయి అధికారులు కార్యక్రమంలో పాల్గొంటే సమస్యలు పరిష్కారమవుతాయని సూచన
తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజునే రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది. 

ఈ కార్యక్రమంలో జిల్లాల వారీగా  కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలు రాష్ట్ర స్థాయి అధికారులకు పంపుతారు. 

ఇప్పటివరకూ ఈ కార్యక్రమాలు మొక్కుబడిగా సాగాయన్న ఆరోపణలు ఉన్నాయి. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు వస్తేనే తమ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ప్రజలు అంటున్నారు. దిగువస్థాయి అధికారులతో ఆశించిన ప్రయోజనం దక్కదని చెబుతున్నారు. అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలు, వాటికి లభించిన పరిష్కాలపై తరచూ సమీక్ష జరగాలని కూడా ప్రజలు కోరుతున్నారు.


More Telugu News