ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- గత 24 గంటల్లో కొత్తగా 166 కోవిడ్ కేసుల నమోదు
- ప్రస్తుతం దేశంలో 895 యాక్టివ్ కేసులు
- సిమ్లాలో కరోనా కారణంగా ఒక మహిళ మృతి
కరోనా మహమ్మారి అంతమయిపోయిందని అందరూ భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కరోనా గురించి చాలా మంది మర్చిపోయారు కూడా. అయితే తాజా పరిణామాలు మరోసారి అందరినీ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇండియాలో మళ్లీ పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 166 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కవ భాగం కేరళలో వెలుగుచూశాయి.
తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. చలికాలం కావడంతో ఇన్ ఫ్లూయెంజా వంటి వైరస్ ల కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది. మరోవైపు సిమ్లాలోని ఓ ఆసుపత్రిలో ఓ మహిళ కరోనా కారణంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రజలంతా తగు జాగ్రత్త చర్యలను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.