డర్బన్ లో వర్షం... టీమిండియా-దక్షిణాఫ్రికా తొలి టీ20 టాస్ ఆలస్యం

  • నేటి నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన
  • నేడు డర్బన్ లో తొలి టీ20
  • వర్షం కురుస్తుండడంతో మైదానాన్ని కవర్లతో కప్పిన సిబ్బంది 
వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా పూర్తి స్థాయి పర్యటనకు సంసిద్ధమైంది. నేటి నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన షురూ కానుంది. ఈ పర్యటనలో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. నేడు డర్బన్ లో ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. 

అయితే డర్బన్ లో వర్షం పడుతుండడంతో ఇంతవరకు టాస్ వేయడానికి సాధ్యం కాలేదు. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఒకవేళ వర్షం తగ్గి మ్యాచ్ ప్రారంభమైతే ఓవర్లు తగ్గించే అవకాశం ఉంది. 

ఇటీవల సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా 4-1తో ఆసీస్ ను ఓడించి టీ20 సిరీస్ చేజిక్కించుకోవడం తెలిసిందే. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ లోనూ టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. శుభ్ మాన్ గిల్, రవీంద్ర జడేజా, సిరాజ్ వంటి కీలక ఆటగాళ్ల రాకతో టీమిండియా బలంగా కనిపిస్తోంది.


More Telugu News