ఒక్క ఓటమితో రోహిత్ చెత్త కెప్టెన్ అయిపోడు: గంభీర్

  • కెప్టెన్ గా రోహిత్ శర్మ గొప్పగా రాణించాడన్న గంభీర్
  • ఐదు ఐపీఎల్ టైటిళ్లు నెగ్గడం సులువు కాదని వెల్లడి
  • వరల్డ్ కప్ లోనూ టీమిండియా ఆధిపత్యం చెలాయించిందని వివరణ
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మపై తన అభిప్రాయాలు వెల్లడించాడు. రోహిత్ శర్మ కెప్టెన్ గా గొప్పగా రాణించాడని కితాబిచ్చాడు. 5 ఐపీఎల్ టైటిళ్లు నెగ్గడం సామాన్యమైన విషయం కాదని, రోహిత్ ప్రతిభాపాటవాలకు అది నిదర్శనమని తెలిపాడు. 

ఇటీవలి వరల్డ్ కప్ లోనూ ఫైనల్ మినహాయిస్తే మిగిలిన అన్ని మ్యాచ్ ల్లో రోహిత్ నాయకత్వంలో భారత్ ఆధిపత్యం చెలాయించిందని గంభీర్ వివరించాడు. భారత్ చాంపియన్ లా ఆడిందని కొనియాడాడు. ఒక్క మ్యాచ్ (ఫైనల్)లో ఓడినంత మాత్రాన రోహిత్ చెత్త కెప్టెన్ అయిపోడని వ్యాఖ్యానించాడు. రోహిత్ ను చెత్త కెప్టెన్ అని పిలిచినా, టీమిండియాను చెత్త జట్టు అని పిలిచినా అది సరికాదు అని గంభీర్ స్పష్టం చేశాడు.


More Telugu News