అండర్-19 ఆసియా కప్: పాకిస్థాన్ కు 260 పరుగుల టార్గెట్ నిర్దేశించిన టీమిండియా

  • దుబాయ్ లో అండర్-19 ఆసియా కప్
  • నేడు భారత్ × పాకిస్థాన్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్
  • 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసిన భారత్
దుబాయ్ లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో నేడు భారత్, పాకిస్థాన్ యువ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన భారత కుర్రాళ్ల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. 

ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (62), కెప్టెన్ ఉదయ్ సహారన్ (60), సచిన్ దాస్ (58) అర్ధసెంచరీలతో రాణించారు. హైదరాబాదీ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఆరవెల్లి అవినాశ్ 11 పరుగులు చేశాడు. హైదరాబాద్ కు చెందిన మరో ఆటగాడు మురుగన్ అభిషేక్ 4 పరుగులకు అవుటయ్యాడు. 

పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ జీషాన్ 4 వికెట్లతో సత్తా నిరూపించుకున్నాడు. అమీర్ హసన్ 2, ఉబైద్ షా 2, అరాఫత్ మిన్హాస్ 1 వికెట్ తీశారు. అనంతరం, 260 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ అండర్-19 జట్టు 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది.


More Telugu News