సిర్పూర్ కాగజ్‌నగర్ రైలు ఇంజిన్‌లో పొగలు.. బీబీనగర్‌లో నిలిపివేత
- సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ బయలుదేరిన రైలు
- కాసేపటికే ఇంజిన్‌లో దట్టమైన పొగలు
- బ్రేక్ లైనర్లు పట్టేయడం వల్లేనని నిర్ధారణ
- మరమ్మతుల అనంతరం బయలుదేరిన రైలు
సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా పొగలు రావడం కలకలం రేపింది. ఈ ఉదయం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన కాసేపటికే ఇంజిన్‌లో దట్టమైన పొగలు రావడంతో అప్రమత్తమైన లోకో పైలట్ బీబీనగర్ రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు.
ఇంజిన్ బ్రేక్ లైనర్లు బలంగా పట్టేయడం వల్లే పొగలు వ్యాపించినట్టు గుర్తించారు. స్టేషన్‌లోని రైల్వే సిబ్బంది వెంటనే మరమ్మతులు చేయడంతో 20 నిమిషాల తర్వాత రైలు బయలుదేరింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.