పార్లమెంటులో బహిష్కరణకు గురైన తొలి ఎంపీ ఎవరో తెలుసా?

  • ప్రశ్నకు నోటు ఆరోపణలతో ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు 
  • 1951లో తొలిసారిగా కాంగ్రెస్‌ ఎంపీ హెచ్ సీ ముద్గల్ బహిష్కరణ
  • 2005 ఏకంగా 10 మంది ఎంపీలపై ఒకే రోజున వేటు
లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు నగదు, బహుమతులు తీసుకున్నారన్న ఆరోపణలతో తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పత్రికల పతాక శీర్షికల్లో నిలిచిన ఈ ఉదంతానికి మొయిత్రా బహిష్కరణతో ముగింపు పడినట్టైంది. అయితే, గతంలోనూ పలువురు ఎంపీలపై ఇదే తరహా ఆరోపణలు రాగా వారిలో కొందరు బహిష్కరణకు గురి కావాల్సి వచ్చింది. 

  • నోటుకు ప్రశ్న ఆరోపణలపై తొలిసారిగా బహిష్కరణకు గురైన నేత హెచ్‌డీ ముద్గల్ (కాంగ్రెస్). వాణిజ్య సంఘాల నుంచి డబ్బు తీసుకున్నారన్న ఆరోపణల కారణంగా ఆయన 1951లో పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 
  • 1978లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా పార్లమెంటులో బహిష్కరణకు గురయ్యారు. ఆమెను లోక్‌సభ నుంచి తొలగిస్తూ అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి 279 మంది అనుకూలంగా 138 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రత్యేక హక్కుల ఉల్లంఘన కేసులో బహిష్కరణ వేటుపడిన తొలి మాజీ ప్రధానిగా ఆమె అపప్రథ మూటగట్టుకున్నారు. 
  • 1976 నాటి ఎమర్జెన్సీ కాలంలో అభ్యంతరకర వ్యవహారశైలి ఆరోపణలపై అప్పటి జన్ సంఘ నేత సుబ్రమణ్యస్వామిపై కూడా బహిష్కరణకు గురయ్యారు. 
  • 2005లో నోటుకు ప్రశ్న ఆరోపణలపై ఒకే రోజున ఏకంగా 10 మంది ఎంపీలను అప్పటి పార్లమెంటు బహిష్కరించింది. ప్రణబ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి క్షణాల్లో పార్లమెంటు ఆమోదం తెలిపింది. 
  • రాజసభ సభ్యుడు ఛత్రపాల్ సింగ్ లోధాను కూడా 2005లో ఇదే ఆరోపణలపై తన సభ్యత్వాన్ని కోల్పోయారు.
  • బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టినందుకు పారిశ్రామిక వేత్త విజయమాల్యాను రాజసభ్య నుంచి బహిష్కరించారు. 
  • మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా బహిష్కరణకు గురయ్యారు. ఈ కేసులో రాహుల్‌ను దోషిగా తేలుస్తూ సూరత్ కోర్టు తీర్పు వెలువరించిన మరుసటి రోజే రాహుల్‌పై పార్లమెంటులో బహిష్కరణ వేటు పడింది. 


More Telugu News