పశుసంవర్ధక శాఖ ఆఫీస్‌లో కీలక ఫైళ్లు మాయం.. ఖండించిన తలసాని ఓఎస్డీ
- కిటికీ గ్రిల్స్ తొలగించి పైల్స్ ఎత్తుకెళ్లినట్లుగా సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్
- రంగంలోకి సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ బృందం
- ఫైళ్లు మాయమైనట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేసిన ఓఎస్డీ కల్యాణ్
తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో దస్త్రాలు అదృశ్యమయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ కార్యాలయంలో దస్త్రాలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. మాసాబ్ ట్యాంక్‌లో ఈ కార్యాలయం ఉంది. ఓఎస్టీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్‌లపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిటికీ గ్రిల్స్ తొలగించి పైల్స్ ఎత్తుకెళ్లినట్లుగా సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆఫీస్‌లో చెల్లాచెదురుగా ఫైళ్లు పడి ఉండడం అందులో ముఖ్యమైన ఫైళ్లు లేకపోవడంతో అధికారులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ బృందం రంగంలోకి దిగింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఘటనాస్థలంలో డీసీపీ శ్రీనివాస్ కొన్ని ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. దొరికిన ఆధారాలతో డైరెక్టర్‌ను డీసీపీ ప్రశ్నించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఫైల్స్ మాయంపై ఎలాంటి సమాచారం లేదని డైరెక్టర్ తెలిపారు. ఫైల్స్ అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓఎస్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్‌లపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు నాంపల్లి పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా ఫైళ్లు మాయమైనట్లు వస్తున్న వార్తలను కల్యాణ్ కొట్టిపారేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మంత్రి ఆమోదం కోసం వచ్చిన ఫైళ్లను నిర్దిష్టమైన విధానంలో ఎప్పటికప్పుడు పశుసంవర్ధక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో అందించినట్లు తెలిపారు. ప్రభుత్వ మార్పిడి, ఇతర సామగ్రి జీఏడీకి అప్పగించే ప్రక్రియలో భాగంగానే మాసాబ్ ట్యాంక్ కార్యాలయానికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఫైల్స్ మార్పిడిపై అసత్య ప్రచారం సాగుతోందన్నారు.