అక్బరుద్దీన్‌ను ఎందుకు నియమించారు?...స్పీకర్ వచ్చాకే ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తాం: బీజేపీ ఎమ్మెల్యేలు

  • కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల స్నేహబంధం మరోసారి రుజువైందని వ్యాఖ్య
  • అక్బరుద్దీన్ కంటే ఐదుగురు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారన్న బీజేపీ ఎమ్మెల్యేలు
  • మజ్లిస్ మెప్పు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలన్న బీజేపీ
కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల స్నేహబంధం మరోసారి రుజువైందని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా నియమించడంతో ఆ రెండు పార్టీల బంధం వెల్లడైందన్నారు. మజ్లిస్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌‌ను కలిశారు. అక్బరుద్దీన్ కంటే ఐదుగురు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారని, అయినప్పటికీ ఆయనను ఎందుకు నియమించారు? అని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ మెప్పు పొందడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. మజ్లిస్, బీజేపీ ఒక్కటేనని ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అదే మజ్లిస్ పార్టీని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. స్పీకర్ వచ్చాకే తాము ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తామని తేల్చి చెప్పారు.


More Telugu News