ఐటీఐఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డితోను, కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

  • పారిశ్రామిక, ఐట రంగాలలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామన్న శ్రీధర్ బాబు
  • యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయమన్న శ్రీధర్ బాబు
  • ఫార్మా సిటీ విషయంలో ప్రజల ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటామన్న మంత్రి
గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి  శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామిక, ఐటీ రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు వీలైనంతగా కల్పించడమే ధ్యేయంగా పని చేస్తామన్నారు. ఫార్మాసిటీ విషయంలో ప్రజల ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ తర్వాతే నిర్ణయానికి వస్తామన్నారు. శాసన సభలో ఫలవంతమైన చర్చలు జరిగేలా చూస్తామన్నారు.


More Telugu News