జిల్లాలో ఇకపై ప్రతి అధికారిక కార్యక్రమానికి నా అర్ధాంగిని పిలవాలి: జగ్గారెడ్డి
- అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి పరాజయం
- బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో ఓటమి
- తన అర్ధాంగి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలన్న జగ్గారెడ్డి
- ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది తమ ప్రభుత్వమేనని వెల్లడి
- అధికారులు ఈ విషయం గమనించాలని స్పష్టీకరణ
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. దాదాపు కాంగ్రెస్ అగ్రనేతలందరూ గెలుపొందారు. కానీ బలమైన నేతగా గుర్తింపు పొందిన జగ్గారెడ్డి మాత్రం ఓటమిపాలయ్యారు. సంగారెడ్డి తన కంచుకోట అని చెప్పుకునే జగ్గారెడ్డి... బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు.
ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కొన్ని కారణాల వల్ల పరాజయం పాలయ్యానని అన్నారు. సంగారెడ్డిలో రాజకీయ పరిస్థితులు తనకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ హుందాగా వ్యవహరించానని తెలిపారు.
ఇప్పుడు రాష్ట్రంలో తమ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉందని జగ్గారెడ్డి చెప్పారు. ఇకపై సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగే ప్రతి అధికారిక కార్యక్రమానికి, ప్రతి ప్రారంభోత్సవానికి తన అర్ధాంగి నిర్మలను కూడా ఆహ్వానించాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఎందుకంటే, ఆమె సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు గమనించాలని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.