ఎవరీ కాష్వీ గౌతమ్... జాతీయ జట్టుకు ఆడకపోయినా డబ్ల్యూపీఎల్ వేలంలో రూ.2 కోట్లు
- వచ్చే డబ్ల్యూపీఎల్ సీజన్ కోసం నేడు వేలం
- ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని కాష్వీ
- కనీస ధర రూ.10 లక్షలు... కాష్వీ కోసం పోటీపడిన గుజరాత్, యూపీ
- కాష్వీని దక్కించుకున్న గుజరాత్ జెయింట్స్
గతేడాది నుంచి భారత్ లో ఐపీఎల్ తరహాలో మహిళా క్రికెటర్లతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, డబ్ల్యూపీఎల్-2024 సీజన్ కోసం నేడు క్రికెటర్ల వేలం చేపట్టారు.
ఆశ్చర్యకరంగా, ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని కాష్వీ గౌతమ్ అనే మహిళా క్రికెటర్ కు అదిరిపోయే ధర పలికింది. కాష్వీ గౌతమ్ కనీస ధర రూ.10 లక్షలు కాగా, ఆమెను వేలంలో గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఓ అన్ క్యాప్డ్ క్రికెటర్ (ఇప్పటివరకు జాతీయ జట్టుకు ఆడని ప్లేయర్) కు ఈ రేటు దక్కడం ఓ రికార్డు.
కాష్వీ గౌతమ్ ప్రధానంగా ఆల్ రౌండర్. ఆమె కోసం వేలంలో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి గుజరాత్ ఆమెను దక్కించుకుంది. 20 ఏళ్ల కాష్వీ గౌతమ్ పంజాబ్ కు చెందిన మహిళా క్రికెటర్. ఇప్పటివరకు ఇండియా-ఏ జట్టుకు ఆడడమే ఆమె కెరీర్ లో గొప్ప ఘనత. అయితే దేశవాళీ పోటీల్లో విశేషంగా రాణించడంతో డబ్ల్యూపీఎల్ ఫ్రాంచైజీలు కాష్వీపై కన్నేశాయి. ఈ యువ ఆల్ రౌండర్ డబ్ల్యూపీఎల్ లో సత్తా నిరూపించుకుంటే జాతీయ జట్టుకు ఎంపిక కావడం నల్లేరుపై నడకే.
మరో అన్ క్యాప్డ్ ప్లేయర్ వింద్రా దినేశ్ కూడా భారీ ధరను పొందింది. ఈ కర్ణాటక హార్డ్ హిట్టర్ కనీస ధర రూ.10 లక్షలు కాగా... ఆమెను యూపీ వారియర్స్ రూ.1.3 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక, నేటి వేలంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ అనాబెల్ సదర్లాండ్ కు కూడా రూ.2 కోట్ల ధర పలికింది. ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. సదర్లాండ్ కనీస ధర రూ.30 లక్షలే.
దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ షబ్నిమ్ కు కూడా వేలంలో భారీ ధర లభించింది. ఆమె కనీస ధర రూ.40 లక్షలు కాగా... ముంబయి ఇండియన్స్ రూ.1.2 కోట్లతో కొనుగోలు చేసింది.
ఇతర క్రికెటర్ల ధరల వివరాలు...
లిచ్ ఫీల్డ్ (ఆస్ట్రేలియా)- రూ.1 కోటి (గుజరాత్ జెయింట్స్)
ఏక్తా బిస్త్ (టీమిండియా)- రూ.60 లక్షలు (బెంగళూరు)
కేట్ క్రాస్ (ఇంగ్లండ్)- రూ.30 లక్షలు (బెంగళూరు)
డానియెల్లే వ్యాట్ (ఇంగ్లండ్)- రూ.30 లక్షలు (బెంగళూరు)
జార్జియా వేర్ హామ్ (ఆస్ట్రేలియా)- రూ.30 లక్షలు (బెంగళూరు)