జీడీపీతో పోల్చితే ఏ దేశపు రుణం ఎంత?.. వేగంగా అప్పుల్లో కూరుకుపోయిన చైనా!
- కొవిడ్-19 తర్వాత ప్రపంచ ఆర్థికవ్యవస్థలో గణనీయ మార్పులు
- అప్పుల్లో పడేసిన సంక్షోభ నివారణ చర్యలు
- రుణానానికి-జీడీపీకి మధ్య కుదరని పొంతన
- అమెరికా, జపాన్, ఇండియా, చైనా పరిస్థితి కూడా ఇదే
- రుణగ్రస్థ దేశాల్లో వెనిజులా తర్వాతి స్థానంలో జపాన్
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిన చైనా క్రమంగా అప్పుల్లో కూరుకుపోతోందా? కరోనా తర్వాత దాని అప్పు తడిసిమోపెడవుతోందా? అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ట్రేడింగ్ ఎకనమిక్స్ గణాంకాలు అవుననే చెబుతున్నాయి. ఇదే బాటలో పలు అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఉండడం గమనార్హం. కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా తీసుకున్న చర్యలు ప్రపంచం మొత్తాన్ని అప్పుల్లో పడేశాయి. ప్రభుత్వ రుణాల స్థాయి విపరీతంగా పెరిగింది.
అంతేకాదు, అభివృద్ధి చెందిన అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు 2021 నాటికి వాటి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 100 శాతానికిపైగా ప్రభుత్వ రుణాలు కలిగి ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే.. వృద్ధి తిరిగి పుంజుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా సగటు ప్రజారుణం కొంతమేర తగ్గింది. ఈ విషయంలో ద్రవ్యోల్బణం కూడా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. కొన్ని పన్ను రాబడులను పెంచడం ద్వారా రుణం-జీడీపీ మధ్య నిష్పత్తిని తగ్గించడంలో సాయపడింది.
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ట్రేడింగ్ ఎకనమిక్స్ గణాంకాల ప్రకారం.. 2021లో అమెరికాలో ప్రభుత్వ రుణాల స్థాయి జీడీపీలో 128 శాతంగా ఉంది. ఈ ఏడాది చివరినాటికి అది 5 శాతం పెరిగి జీడీపీలో 133 శాతంగా ఉంటుందని అంచనా. జర్మనీ, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్ వంటి యూరప్‌లోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు 2021 నుంచి తమ రుణ-జీడీపీ నిష్పత్తిలో 6 నుంచి 7 శాతం క్షీణతను చూపుతున్నాయి.
అధ్యయనం నిర్వహించిన కాలంలో చైనా, ఇండియా, అమెరికా, జపాన్‌లో రుణం-జీడీపీ మధ్య నిష్పత్తి పెరిగినట్టు గుర్తించారు. సంక్షేమం, సాంకేతిక పురోగతి పర్యాయపదంగా ఉండే జపాన్ అత్యంత రుణగ్రస్థ దేశమైన వెనిజులా తర్వాతి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది దాని జీడీపీ 263 శాతానికి చేరతుందని అంచనా. అంటే ఈ పెరుగుదల రెండేళ్లలో మూడుశాతమన్నమాట.