కేసీఆర్‌కు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం
- ఆపరేషన్ థియేటర్ నుంచి గదికి మార్చిన వైద్యులు
- వీడియోను షేర్ చేసిన ప్రముఖ జర్నలిస్ట్
- ఆసుపత్రిలో కేసీఆర్‌ను పరామర్శించిన జానారెడ్డి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని, ఆయనను గదికి మార్చామని, బీఆర్ఎస్ అధినేత కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని ప్రముఖ జర్నలిస్ట్ సుధాకర్ ఉండుముల ట్వీట్ చేశారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్‌ను మరో గదికి మారుస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.
కేసీఆర్‌కు శస్త్రచికిత్స విజయవంతమైనట్లు యశోద ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఎనిమిది వారాల్లో ఆయన కోలుకుంటారని తెలిపారు. ఇదిలావుంచితే, కేసీఆర్‌ను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి తన భార్య, తనయుడు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ వెంకట్ రెడ్డితో కలిసి పరామర్శించారు. శుక్రవారం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.