ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం

  • 2009 నుంచి 2014 జూన్ 2 వరకు నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని ఆదేశం
  • అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాల జారీ
  • సీఎం నిర్ణయం పట్ల ఉద్యమకారులు, ప్రజల హర్షం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించాలని పోలీసు శాఖను రేవంత్ ఆదేశించారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో రేపటి నుంచి రెండింటిని అమలు చేస్తామని ప్రకటించారు. మరోవైపు ఈ రోజు ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. ఈ రోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పాల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేయనున్నట్లు తెలిపారు. 2009 నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. వివరాలు వచ్చిన వెంటనే ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తి వేయనున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల ఉద్యమకారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News