పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో అబ్రహాం లింకన్ ను ప్రస్తావించడంపై రామ్ గోపాల్ వర్మ స్పందన

  • గత ఎన్నికల్లో ఓటమిపాలైన పవన్ కల్యాణ్
  • నిన్న విశాఖ సభలో అమెరికా మాజీ అధ్యక్షుడు లింకన్ గురించి వ్యాఖ్యలు
  • లింకన్ అనేక ఎన్నికల్లో ఓడిపోయారన్న పవన్
  • ఆ సమయంలో లింకన్ గురించి ఎవరికీ తెలియదన్న వర్మ
  • మీరు అందరికీ తెలిసి కూడా ఓడిపోయారంటూ వివరణ
జనసేనాని పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన సంగతి తెలిసిందే. నిన్న విశాఖలో ఏర్పాటు చేసిన జనసేన సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, అమెరికా చరిత్రలో నిలిచిపోయిన మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ కూడా అనేక ఎన్నికల్లో ఓడిపోయారంటూ ప్రస్తావన తెచ్చారు. లింకన్ న్యాయవాద ఎన్నికల్లో ఓడిపోయారు, సెనేటర్ ఎన్నికల్లో ఓడిపోయారు, గవర్నర్ ఎన్నికల్లో ఓడిపోయారు అని పవన్ వివరించారు. 

అయితే, పవన్ వ్యాఖ్యలను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుబట్టారు. "మీ ఓటమిని సమర్థించుకోవడానికి మీరు అబ్రహాం లింకన్ ప్రస్తావన తీసుకురావడం సమంజసంగా లేదు. మీలాగే లింకన్ కూడా ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పే ప్రయత్నం ఏమాత్రం అతకలేదు. మీకు, అబ్రహాం లింకన్ కు సారూప్యత అనేదే లేదు. ఎందుకంటే... లింకన్ ఆ ఎన్నికల్లో ఓడిపోయే నాటికి ఆయన గురించి ఎవరికీ తెలియదు. అప్పటికి ఆయన ఓ సామాన్యమైన వ్యక్తి మాత్రమే. కానీ మీరు ఎన్నికల్లో పాల్గొన్న నాటికి సినిమాల్లో మీరొక సూపర్ స్టార్. మీ గురించి అందరికీ తెలుసు... కానీ ఓడిపోయారు... అదీ మీకు, లింకన్ కు ఉన్న తేడా" అని వర్మ వివరించారు.


More Telugu News