వారికి సేవకుడిగా సాయం చేసేందుకు అవకాశం రావడం తృప్తిగా ఉంది: రేవంత్ రెడ్డి
- ఉదయం ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించిన రేవంత్ రెడ్డి
- జనం కష్టాలు వింటూ... కన్నీళ్లు తుడుస్తూ ప్రజా దర్బార్ సాగిందని పేర్కొన్న రేవంత్ రెడ్డి
- జనం గుండె చప్పుడు విన్నానని వెల్లడి
తొలి ప్రజాదర్బార్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రజలకు సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించిన సంతృప్తి లేదని పేర్కొన్నారు. ఈ మేరకు మధ్యాహ్నం ఆయన ట్వీట్ చేశారు.
'జనం కష్టాలు వింటూ… కన్నీళ్లు తుడుస్తూ... తొలి ప్రజా దర్బార్ సాగింది.
జనం నుండి ఎదిగి…
ఆ జనం గుండె చప్పుడు విని…
వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించి తృప్తి ఏముంటుంది!' అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
కాగా, ప్రజా భవన్‌లో రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున జనాలు ప్రజా భవన్‌కు వచ్చారు.