ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా తెలంగాణ ఉద్యమ సారథి కోదండరామ్?
- కోదండరామ్ అనుభవాన్ని ఉపయోగించుకుంటామని ఇంతకు ముందే చెప్పిన రేవంత్
- ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టీజేఎస్
- ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కోదండరామ్
తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ ది ఒక ప్రత్యేకమైన స్థానం. ఉద్యమ సారథిగా ఆయన తెలంగాణ సాధన పోరాటాన్ని ముందుండి నడిపించారు. సకలజనుల సమ్మెతో ఉద్యమాన్ని తార స్థాయికి తీసుకెళ్లారు. మరోవైపు, కోదండరామ్ అనుభవాలని, ఆయన ఆలోచనలను ఉపయోగించుకుంటామని ఇంతకు ముందే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన సలహాలను తీసుకుంటామని రేవంత్ చెప్పారు. చెప్పినట్టుగానే కోదండరామ్ కు రేవంత్ రెడ్డి కీలకమైన బాధ్యతను అప్పగించబోతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కోదండరామ్ ను నియమించే అవకాశం ఉందని చెపుతున్నారు.
ఎన్నికల ముందు నుంచి కూడా రేవంత్, కోదండరామ్ ఎన్నోసార్లు కలిశారు. కాంగ్రెస్ తో కోదండరామ్ పార్టీ టీజేఎస్ పొత్తు పెట్టుకుంది. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేయనని కోదండరామ్ చెప్పడంతో... టీజేఎస్ కు కాంగ్రెస్ టికెట్లు కేటాయించలేదు. ఇప్పుడు ఆయనకు ప్రధాన సలహాదారు పదవిని ఇవ్వనున్నట్టు సమాచారం. కోదండరామ్ తన పక్కన ఉంటే సీఎంగా తాను సక్కెస్ కావడానికి ఆయన సలహాలు, సూచనలు దోహదపడతాయని రేవంత్ భావిస్తున్నారు.