ఆ పెయిన్ కిల్లర్‌తో ప్రతికూల ప్రభావాలు.. ప్రభుత్వం హెచ్చరిక జారీ
- మెఫనామిక్ యాసిడ్‌తో (మెఫ్టాల్) ప్రతికూల ప్రభావాలకు అవకాశం ఉందన్న ఐపీసీ
- బాధితుల్లో డీఆర్ఈఎస్ఎస్ (తీవ్ర అలర్జీ) తలెత్తవచ్చని అలర్ట్
- వైద్యులు ఈ మందు సూచించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచన
నొప్పి నివారణకు ఉపయోగించే మెఫ్టాల్ పెయిన్ కిల్లర్‌తో (మెఫనామిక్ యాసిడ్) ప్రతికూల ప్రభావాలు ఉన్నాయని ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ (ఐపీసీ) తాజాగా అలర్ట్ జారీ చేసింది. ఈ ఔషధంతో ఇస్నోఫీలియా, సిస్టమిక్ సింప్టమ్స్ సిండ్రోమ్ (తీవ్ర అలర్జీ) వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది.
ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, డిస్మెనోరియా, నొప్పి, ఇన్‌ఫ్లమేషన్, జ్వరం, పంటి నొప్పి తదితర సమస్యలకు వైద్యులు మెఫనామిక్ యాసిడ్‌ను సూచిస్తారు.
ఫార్మకొవిజిలెన్స్ ప్రాగ్రామ్ ఆఫ్ ఇండియా డేటాబేస్‌లోని సమాచారం ఆధారంగా జరిపిన ప్రాథమిక అధ్యయనంలో మెఫనామిక్ యాసిడ్ ప్రతికూల ఫలితాల గురించి వెల్లడైంది. ఈ ఔషధం వాడకంతో డీఆర్ఈఎస్ఎస్ సిండ్రోమ్ అనే తీవ్ర అలర్జీ తలెత్తుతున్నట్టు ఐపీసీ పేర్కొంది. డీఆర్ఈఎస్ఎస్ సిండ్రోమ్ బారిన పడ్డ బాధితుల్లో స్కిన్ రాష్, జ్వరం, లింఫాడినోపతీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఔషధం వాడటం మొదలెట్టిన రెండు నుంచి ఎనిమిది వారాల మధ్య ఈ అలర్జీ లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఈ మందు సూచించాక వైద్యులు, రోగుల్లో అలర్జీ సంబంధిత సమస్యలు వస్తున్నాయా? లేదా? అని నిశితంగా గమనించాలని ఐపీసీ సూచించింది. సమస్య తలెత్తినప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొంది.