రేవంత్ నివాసం, కార్యాలయం, నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు
- సీఎంగా రేవంత్ పేరును ప్రకటించిన వెంటనే అలర్ట్ అయిన విద్యుత్ శాఖ
- విద్యుత్ సరఫరాపై సమీక్ష నిర్వహించిన ఉన్నతాధికారులు
- రేవంత్ నివాసానికి రెండు సబ్ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు సీఎంగా రేవంత్ రెడ్డిని పార్టీ హైకమాండ్ ప్రకటించిన వెంటనే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ లోని రేవంత్ నివాసం, కార్యాలయం, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొండగల్ లో విద్యుత్ సరఫరాపై అధికారులు సమీక్ష నిర్వహించారు. గతంలో రేవంత్ నివాసానికి జూబ్లీహిల్స్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యేది. అక్కడ ఏదైనా సమస్య తలెత్తినా విద్యుత్ సరఫరా ఆగకుండా చూసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. రోడ్ నంబర్ 22లోని సబ్ స్టేషన్ నుంచి కూడా విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టారు. కొడంగల్ లో విద్యుత్ సరఫరాపై కూడా సమీక్ష నిర్వహించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా గజ్వేల్ లో విద్యుత్ సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.