ఏపీలో ఎస్సై పరీక్ష ఫలితాల విడుదల

  • డిసెంబర్ 6న ఫలితాలను విడుదల చేసిన రిక్రూట్‌మెంట్ బోర్డు
  • అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఫలితాలు, తుది పరీక్ష ఆన్సర్ కీ
  • అభ్యర్థులు తమ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఆధారంగా ఫలితం చెక్ చేసుకునే సౌలభ్యం
ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మెయిన్ పరీక్ష తుది ఆన్సర్ కీని కూడా బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులు తమ రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాల ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. 

ఏపీ వ్యాప్తంగా 411 ఎస్సై పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షకు మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 19న జరిగిన ప్రాథమిక రాత పరీక్షకు 1,51,288 మంది హాజరవగా వారిలో 57,923మంది క్వాలిఫై అయ్యారు. అనంతరం జరిగిన దేహదారుఢ్య పరీక్షల్లో క్వాలిఫై అయిన 31,193 మంది అభ్యర్థులకు తుది రాత పరీక్ష నిర్వహించి తాజాగా ఫలితాలను విడుదల చేశారు.  ఫలితాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.


More Telugu News