అపరకుబేరుల జాబితాలో 15వ స్థానానికి ఎగబాకిన అదానీ

  • హిండెన్ బర్గ్ సంస్థ ఆరోపణల ప్రభావం నుంచి క్రమంగా కోలుకుంటున్న గౌతమ్ అదానీ
  • మంగళవారం 12 బిలియన్ డాలర్ల మేర పెరిగిన అదానీ సంస్థల షేర్ల విలువ
  • హిండెన్‌బర్గ్ ఆరోపణలపై యూఎస్ డీఎఫ్‌సీ నిర్ణయం నేపథ్యంలో జోష్
కార్పొరేట్ మోసానికి పాల్పడ్డారంటూ హిండెన్ బర్గ్ సంస్థ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇక్కట్ల పాలైన అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీ క్రమంగా పుంజుకుంటున్నారు. మంగళవారం అదానీ సంస్థల షేర్ల విలువ ఏకంగా 12 బిలియన్ డాలర్ల మేర పెరగడంతో ఆయన అత్యంత సంపన్నుల జాబితాలో 15వ స్థానానికి ఎగబాకారు. ప్రస్తుతం అదానీ నికర సంపద విలువ 82.5 బిలియన్ డాలర్లు. 

గత నెలలోనే గౌతమ్ అదానీ టాప్-20 అపరకుబేరుల జాబితాలో కోల్పోయిన తన స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే, మంగళవారం అదానీ కంపెనీ మార్కెట్ విలువ 11 నెలల గరిష్ఠానికి చేరింది. శ్రీలంకలో ఓ ప్రాజెక్టుకు సంబంధించి లోన్‌ జారీకి మునుపు యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (యూఎస్ డీఎఫ్‌సీ) హిండెన్ బర్గ్ ఆరోపణలను నిశితంగా పరిశీలించింది. అనంతరం ఈ ఆరోపణలతో తాజాగా లోన్‌కు సంబంధం లేదని తేల్చింది. దీంతో, అదానీ సంస్థల షేర్లు కొత్త పుంతలు తొక్కాయి.


More Telugu News