బంగ్లాదేశ్ బ్యాటర్ సెల్ఫ్ అవుట్.. టెస్ట్‌ల చరిత్రలో తొలి ఘటన

  • న్యూజిలాండ్‌తో మీర్పుర్ వేదికగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో ఘటన
  • జేమిసన్ వేసిన బంతి తన బ్యాట్‌కు తగిలాక చేతితో అడ్డుకున్న బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్
  • అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ రూల్ ప్రకారం అవుట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్
బంగ్లాదేశ్‌లో మీర్పుర్ వేదికగా న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటర్ ముఫ్షీకర్ రహీమ్ సెల్ఫ్ అవుట్ అయ్యాడు. జేమిసన్ వేసిన బంతిని చేతితో అడ్డుకుని పెవిలియన్ బాట పట్టాడు. తొలుత బ్యాటుకు తగిలిన బంతి నేలకు తగిలి పైకి లేచిన తరుణంలో ముష్ఫికర్ దాన్ని చేతితో అవతలి వైపునకు తోశాడు. బంతి వికెట్ల వైపునకు రాకున్నా అతడు అసంకల్పితంగా బంతిని అడ్డుకున్నాడు. ఈ విషయమై న్యూజిలాండ్ క్రీడాకారులు అప్పీలు చేసుకోవడంతో, అతడు అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ నిబంధన కింద అవుటయ్యాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం ప్రకారం అతడు పెవిలియన్ బాటపట్టాల్సి వచ్చింది. దీంతో, టెస్టు చరిత్రలో ఈ నిబంధన కింద అవుటైన తొలి క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు.  

గతంలో ఇలాంటి ఘటనలను హ్యాండ్లింగ్ ద బాల్ నిబంధన కింద పరిగణించేవారు. అయితే, ఈ చర్య కూడా అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ నిబంధనల కిందే పరిగణించాలన్న భావనతో 2017లో ఈ మేరకు మార్పులు చేశారు. నిబంధనల్లో సరళత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఇదిలా ఉంటే, సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో తలపడుతున్న బంగ్లాదేశ్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. తొలి టెస్టులో ప్రత్యర్థిని మట్టికరిపించిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో కూడా న్యూజిలాండ్‌కు ముచ్చెమటలు పట్టిస్తోంది.


More Telugu News