రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన ఆరుగురు ఎమ్మెల్యేలు... రూ.606 కోట్లతో టాప్‌లో వివేక్

  • రూ.458 కోట్లతో రెండో స్థానంలో రాజగోపాల్ రెడ్డి.. రూ.434 కోట్లతో మూడోస్థానంలో పొంగులేటి
  • రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్న వారిలో వినోద్, పొంగులేటి, కొత్త ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి
  • 50 మందికి పైగా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లకు పైగా ఆస్తులు
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 119 మంది ఎమ్మెల్యేలలో ఆరుగురి  ఆస్తులు రూ.100 కోట్లకు మించి ఉన్నాయి. అందరికంటే అత్యధిక ఆస్తులు కలిగిన వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ఆయన ఆస్తులు మొత్తం రూ.606 కోట్లు. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆరుగురు ఎమ్మెల్యేల ఆస్తులు రూ.100 కోట్లు దాటాయి. ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ.458 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ రూ.197 కోట్లు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ.రూ.434 కోట్లు, పి.సుధాకర్ రెడ్డి రూ.102 కోట్లు కలిగి ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. మెదక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన ఆస్తులు రూ.100 కోట్లు, కుటుంబ ఆస్తులు రూ.197 కోట్లుగా ప్రకటించారు.

మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రూ.95.93 కోట్లు ఉన్నట్లు తెలిపారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి రూ.97 కోట్లు, అరికెపూడి గాంధీ రూ.85 కోట్ల ఆస్తులను ప్రకటించారు. బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రూ.85 కోట్లుగా ప్రకటించారు. రూ.100 కోట్లకు పైగా ఆస్తులను ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రకటించగా, పదహారుమంది ఎమ్మెల్యేలు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య ప్రకటించారు.


More Telugu News