రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు: డీజీపీ
- సీఎస్, సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ
- ప్రమాణ స్వీకారానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపిన డీజీపీ
- లక్షమంది ప్రజలు రావొచ్చునని చెప్పిన డీజీపీ రవిగుప్తా
రేపు మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు తెలిపారు. డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతికుమారి, సీపీ సందీప్ శాండిల్య, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ తదితరులు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం డీజీపీ మాట్లాడుతూ... సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం నేపథ్యంలో రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. దాదాపు లక్షమంది సభకు హాజరు కావొచ్చునని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఎల్బీ స్టేడియంలో ముప్పై వేలమంది కూర్చోవచ్చునని స్పష్టం చేశారు. మిగిలిన వారి కోసం స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.