ఈ సినిమాతో నేను ప్రేమలో పడిపోయా: రేణు దేశాయ్

  • 'యానిమల్' సినిమాను చూసిన రేణు దేశాయ్
  • ఈ సినిమాలో మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయన్న రేణు
  • సినిమాను థియేటర్లో చూడాలని సూచన
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన 'యానిమల్' సినిమాపై సినీ నటి రేణు దేశాయ్ ప్రశంసలు కురిపించారు. తాను నిన్న ఈ సినిమాను చూశానని.. అనుకోకుండా చూడాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. సినిమా అద్భుతంగా ఉందని... ఈ సినిమాతో తాను ప్రేమలో పడిపోయానని చెప్పారు. ఈ సినిమాలో మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయని... మీరు ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందాలనుకుంటే ఈ సినిమాను కచ్చితంగా థియేటర్లో చూడాని సూచించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. 

మరోవైపు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే రూ. 500 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమాపై నాలుగు పేజీల రివ్యూను విడుదల చేశారు.


More Telugu News