మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ ఎప్పటి వరకు ఆడతాడు?.. సమాధానం ఇదిగో!
- తానిక నడవలేనని నిర్ధారణకు వచ్చే వరకు ఐపీఎల్ ఆడతానన్న మ్యాక్సీ
- ఐపీఎల్ తన కెరియర్‌పై ఎంతో ప్రభావం చూపించిందన్న ఆసీస్ ఆల్‌రౌండర్
- కోహ్లీ, డివిలియర్స్ వంటి వారితో డ్రెస్సింగ్ రూం పంచుకోవడం గొప్ప అనుభూతి అంటూ ఆనందం
- ఐపీఎల్‌లో 2021 నుంచి ఆర్సీబీకి ప్రాతినిధ్యం
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎప్పటి వరకు ఆడతాడో క్లారిటీ ఇచ్చేశాడు. తానిక నడవలేనన్న నిర్ధారణకు వచ్చే వరకు ఐపీఎల్ ఆడుతూనే ఉంటానని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాష్ లీగ్ సీజన్ కోసం మెల్‌బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్న మ్యాక్స్‌వెల్ తన కెరియర్‌లో ఐపీఎల్ ప్రభావంపై మాట్లాడాడు. బీబీఎల్ 13లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు అతడు సారథ్యం వహిస్తున్నాడు.
మ్యాక్స్‌వెల్ 2012లో ఢిల్లీ కేపిటల్స్‌తో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతడి ఆఫ్ స్పిన్ బౌలింగ్, దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యం వంటివి అతడిపై అంచనాలు పెంచేశాయి. ఢిల్లీ తర్వాత ముంబైకి ఆడినప్పటికీ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. ఐపీఎల్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన మ్యాక్సీ.. పంజాబ్ జట్టు నుంచి ఉద్వాసనకు కూడా గురయ్యాడు. అయితే, ఆర్సీబీకి వచ్చాక మాత్రం తన సామర్థ్యం ఏపాటిదో నిరూపిస్తూ వస్తున్నాడు.
2021 సీజన్‌లో బెంగళూరు అతడిని రూ.14.25 కోట్లకు సొంతం చేసుకుంది. అప్పటి నుంచి అతడు ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ సీజన్‌లో గ్లెన్ 513 పరుగులు సాధించగా, 2023 సీజన్‌లో 14 గేముల్లో మూడు అర్ధ సెంచరీలతో 400 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో తన అద్వితీయ ఆటతో జట్టుకు ప్రపంచకప్ అందించిపెట్టాడు.