ఎందుకే ఈ ఆలోచన .. నాకు ఈ రోజున..: 'బబుల్ గమ్' నుంచి సాంగ్ రిలీజ్!

  • టీనేజ్ లవ్ స్టోరీగా 'బబుల్ గమ్'
  • హీరోగా పరిచయమవుతున్న రోషన్ కనకాల
  • మానస చౌదరికి ఇదే ఫస్టు సినిమా
  • ఈ నెల 29వ తేదీన సినిమా విడుదల

సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా 'బబుల్ గమ్' సినిమా రూపొందింది. విమల నిర్మించిన విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రానుంది. హీరో రోషన్ కి మాత్రమే కాదు, హీరోయిన్ మానస చౌదరికి కూడా తెలుగులో ఇదే ఫస్టు మూవీ. 

తాజాగా ఈ సినిమా నుంచి 'జానూ' అంటూ సాగే  3rd సింగిల్ ను రిలీజ్ చేశారు. 'ఎందుకే ఈ ఆలోచన .. నాకు ఈ రోజున, దేనికే ఈ ఆలాపనా గొంతు తడి ఆరినా' అంటూ ఈ పాట మొదలవుతోంది. నాయిక దూరం కావడంతో .. ఆమె ఎడబాటును తట్టుకోలేక .. ఆమె జ్ఞాపకాలను తలచుకుంటూ హీరో పాడుకునే పాట ఇది. 

 మెలోడియస్ గా సాగే వేదనా భరితమైన సాంగ్ ఇది. శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన ఈ బాణీకి అనంత్ శ్రీరామ సాహిత్యాన్ని అందించగా, జావేద్ ఆలపించాడు. బీట్ యూత్ మనసులను పట్టుకునేలానే ఉంది. మొదటి సినిమాతో రోషన్ కనకాల ఎన్ని మార్కులు తెచ్చుకుంటాడో చూడాలి మరి. 



More Telugu News