తుపాను వేళ కాకినాడ జిల్లాలో సుడిగాలి బీభత్సం... వీడియో ఇదిగో!
- ఏపీ కోస్తా జిల్లాలను హడలెత్తించిన మిగ్జామ్ తుపాను
- కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో సుడిగాలి
- జాతీయ రహదారి పక్క నుంచి దూసుకొచ్చిన వైనం
- సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
అమెరికాలో భూమిపై నుంచి ఆకాశం వరకు సుడులు తిరుగుతూ తీవ్ర విధ్వంసం సృష్టించే టోర్నడోల గురించి తెలిసిందే. తాజాగా, మిగ్జామ్ తీవ్ర తుపాను ఏపీ తీరాన్ని అల్లకల్లోలం చేస్తున్న సమయంలో... కాకినాడ జిల్లాలో టోర్నడో తరహా సుడిగాలి బీభత్సం సృష్టించింది.
గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద జాతీయ రహదారి పక్క నుంచి ఈ సుడిగాలి దూసుకువచ్చింది. రహదారిపై వెళుతున్న వాహనాలు సైతం ఈ సుడిగాలి ధాటికి కుదుపులకు లోనయ్యాయి.
ఆ తర్వాత రహదారి దాటిన సుడిగాలి పెట్రోల్ బంకు పక్క నుంచి వెళుతూ సమీపంలోని కొబ్బరి తోటపైనా ప్రతాపం చూపించింది. సుడిగాలి ధాటికి కొబ్బరి చెట్లు చెల్లాచెదురయ్యాయి. సుడిగాలి ప్రచండవేగం చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.