సోనియాగాంధీ నుంచి కార్యకర్తల వరకు.. రేవంత్ రెడ్డి ధన్యవాదాలు
- ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి
- సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలకు కృతజ్ఞతలు
- ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి
తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన పార్టీ అధిష్ఠానానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తనను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలంగాణ తల్లి సోనియమ్మ స్పూర్తిదాయకమైన నేత, రాహుల్ గాంధీ, ప్రజాకర్షక నాయకురాలు ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు, కాంగ్రెస్ సైనికులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఇదిలావుంచితే, రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలను స్వయంగా కలిసి తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారు. ఇదిలా ఉండగా రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. తమ గ్రామానికి చెందిన రేవంత్ రెడ్డి సీఎం కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క, హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.