తుపాను నేపథ్యంలో.. అధికారులకు రేవంత్ రెడ్డి సూచనలు

  • ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందు రేవంత్ ట్వీట్
  • తుపాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన
  • అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచన
టీపీసీసీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. తనను సీఎల్పీ నేతగా ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందు ఆయన ఎక్స్ వేదికగా తుపాను ప్రభావ అంశంపై ట్వీట్ చేశారు. తెలంగాణలో పలు జిల్లాలలో తుపాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరి ధాన్యం తడిసిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలని తెలిపారు. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కాగా, రేవంత్ రెడ్డికి అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున ఆయనను సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు.


More Telugu News