ఆత్మహత్య ప్రేరేపణ విషయంలో సామీప్యత లేకుంటే దోషిగా నిర్ధారించలేం: సుప్రీంకోర్టు కీలక తీర్పు
- ఆత్మహత్యకు, ప్రేరేపణకు మధ్య సామీప్యత అవసరమన్న సుప్రీం ధర్మాసనం
- ఓ కేసులో 15 రోజుల తర్వాత ఆత్మహత్య
- ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై నమోదైన నేరారోపణలను కొట్టివేస్తూ తీర్పు చెప్పిన ధర్మాసనం
బాధితులకు మరోమార్గం లేకుండాపోయి, ఆత్మహత్యకు ప్రేరేపించిన వెంటనే ఆ పనిచేస్తే తప్ప ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని దోషిగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై నమోదైన నేరారోపణలను కొట్టివేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది.
కేసు వివరాల్లోకి వెళ్తే.. అశోక్ కుమార్ భార్య.. సందీప్ బన్సాల్ అనే వ్యక్తి నుంచి దాదాపు రూ. 40 వేలు అప్పు తీసుకుంది. గడువు ముగిసినా అప్పు తిరిగి చెల్లించకపోవడంతో అశోక్‌పై సందీప్ దురుసుగా ప్రవర్తించాడు. అతడిపై చేయి కూడా చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన అశోక్ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ సంజయ్ బన్సాల్‌పై కేసు నమోదైంది.
ఈ కేసు కాస్తా సుప్రీంకోర్టుకు చేరింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి డబ్బుల కోసం గట్టిగా నిలదీసిన 15 రోజుల తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని, అది ప్రేరేపించడం ఎలా అవుతుందని సంజయ్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఘటన జరిగిన రెండు వారాల తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ప్రేరేపణ విషయంలో సామీప్యత లేకపోవడంతో సంజయ్‌పై నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.