రోడ్లు ప్రమాద బాధితులకు డబ్బులు లేకుండానే చికిత్స!

  • యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం
  • మూడు నాలుగు నెలల్లో అమల్లోకి తీసుకొచ్చే అవకాశం
  • ప్రమాదాల్లో గాయపడినవారికి ఉచిత చికిత్స లక్ష్యంగా కేంద్రం అడుగులు
రోడ్లు ప్రమాదాల్లో గాయపడ్డవారికి సకాలంలో వైద్య చికిత్స అందక చాలామంది మృత్యువాతపడుతున్నారు. డబ్బులు లేని కారణంగా చికిత్స ఆలస్యమవుతున్న సందర్భాలు చాలానే ఉంటున్నాయి. దీనిని అధిగమించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. 

మోటారు వాహనాల సవరణ చట్టం 2019లో భాగంగా దీనిని తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిసింది. మూడు, నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ఉచిత వైద్య చికిత్స అందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.


More Telugu News