రాజశేఖర్ గారు లేని ఈ సినిమాను ఊహించుకోలేను: డైరెక్టర్ వక్కంతం వంశీ
- ఈ నెల 8వ తేదీన రానున్న 'ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్'
- నితిన్ చేసిన ఈ సినిమాకి డైరెక్టర్ వక్కంతం వంశీ
- రాజశేఖర్ పాత్ర హైలైట్ అవుతుందన్న డైరెక్టర్
- ఆయన ఒప్పుకోవడమే గొప్ప విషయమని వెల్లడి
వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన 'ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్' సినిమా ఈ నెల 8వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో వక్కంతం వంశీ మాట్లాడుతూ .. "రాజశేఖర్ గారు ఈ సినిమాలో చాలా చిన్న రోల్ చేసినట్టుగా చెప్పారు. కానీ ఆయన చేయకపోతే ఈ సినిమాను నేను ఊహించుకోలేను.
ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ పాత్రను రాజశేఖర్ గారితో చేయిస్తే బాగుంటుందని నేను బలంగా నమ్మాను. రాజశేఖర్ గారితో నాకు పరిచయం లేదు. అయినా కథపైన .. పాత్రపైన గల నమ్మకంతో ఈ సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు. ఆయన ఎంతలా ఎంటర్టైన్ చేస్తారనేది సినిమా చూసిన తరువాత మీకు అర్థమవుతుంది.
నితిన్ ప్రతి రోజు సెట్ కి రాగానే తన పాత్రను గురించి .. డైలాగ్స్ గురించి అడిగేవారు కాదు. రాజశేఖర్ గారి పాత్ర ఎలా వస్తోంది .. ఆయన డైలాగ్స్ ఎలా ఉంటున్నాయని అడిగి తెలుసుకునేవారు. దాంతో అందరం ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేశాము" అని చెప్పారు.