దూసుకువస్తున్న తీవ్ర తుపాను... ప్రభావిత జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

  • బంగాళాఖాతంలో మిగ్జామ్ తుపాను
  • మరింత బలపడి తీవ్ర తుపానుగా రూపాంతరం
  • గంటకు 8 కిలోమీటర్ల వేగంతో పయనం
  • నెల్లూరుకు 140 కి.మీ దూరంలో కేంద్రీకృతం
మిగ్జామ్ తీవ్ర తుపాను ఏపీ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని కొనసాగుతున్న ఈ తుపాను ఏపీ తీరం దిశగా పరుగులు పెడుతోంది. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోంది. ఇది ప్రస్తుతం నెల్లూరుకు ఆగ్నేయంగా 140 కిలోమీటర్ల చేరువలోకి వచ్చేసింది. ఇది బాపట్ల వద్ద తీరం చేరుతుందన్న నేపథ్యంలో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. 

తుపాను ప్రభావిత జిల్లాలు-స్పెషల్ ఆఫీసర్లు...

1. నెల్లూరు- హరికిరణ్
2. తిరుపతి- జె.శ్యామలరావు
3. ప్రకాశం- ప్రద్యుమ్న
4. బాపట్ల- కాటమనేని భాస్కర్
5. పశ్చిమ గోదావరి- కన్నబాబు
6. తూర్పు గోదావరి- వివేక్ యాదవ్
7. అంబేద్కర్ కోనసీమ- జయలక్ష్మి
8. కాకినాడ- యువరాజ్

కాగా, ప్రైవేటు వాతావరణ సంస్థల తాజా వెదర్ మోడల్స్ ప్రకారం... మిగ్జామ్ తుపాను నెల్లూరు వద్ద తీరం దాటి భూభాగంపైనే ఉత్తర దిశగా పయనించే అకాశాలున్నాయి.



More Telugu News