కేసీఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడని స్వీయ తృప్తి పొందుతున్నారు: విజయసాయిరెడ్డి

  • కాంగ్రెస్ కు టీడీపీ శ్రేణులు సపోర్ట్ చేశాయంటూ వార్తలు
  • తెలంగాణలో పోటీ చేయని చంద్రబాబు ఎన్నికలను ప్రభావితం చేశారా? అని ఎద్దేవా
  • అక్కడి ప్రజలకు చంద్రబాబు ఒక మర్చిపోయిన జ్ఞాపకం అని వ్యాఖ్య
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజార్టీ సాధించింది. ఈ సాయంత్రం కాంగ్రెస్ సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ శ్రేణులు మద్దతుగా నిలిచాయనే వార్తలు వినిపించాయి. గాంధీభవన్ వద్ద కూడా టీడీపీ జెండాలు ఎగిరాయి. ఈ నేపథ్యంలో, విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఎల్లో మీడియా 'స్వీయ సంతృప్తి' పొందుతోందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో పోటీ చేయకుండా ముఖం చాటేసిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఈయన ఒక మర్చిపోయిన జ్ఞాపకం అని అన్నారు. కాంగ్రెస్ గెలుపుకు ఈయన కారణమవుతారా? అని ప్రశ్నించారు. నిజంగా తన పాత్ర ఉంటే అదెలాగో ఎల్లో మీడియా స్పష్టం చేయాలని సవాల్ విసిరారు.



More Telugu News