సీఎం ఎవరనేదానిపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
- రేవంత్ రెడ్డికే తన మద్దతని స్పష్టం చేసిన సీనియర్ లీడర్
- పార్టీ విజయానికి రేవంత్ చాలా కష్టపడ్డాడని వెల్లడి
- 80 నియోజకవర్గాల్లో ప్రచారం చేశాడంటూ మెచ్చుకున్న వీహెచ్
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోయే నేత ఎవరనేదానిపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సీఎం అభ్యర్థిపై పార్టీలోనూ తీవ్రంగా చర్చ జరుగుతోంది. సీఎం అభ్యర్థిని నిర్ణయించేందుకు పార్టీలో మంతనాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సరైన అభ్యర్థి అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి ఎంతగానో కష్టపడ్డాడని వీహెచ్ పేర్కొన్నారు. 80 నియోజకవర్గాల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశాడని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డికే తన మద్దతు ఉంటుందని వివరించారు. కాగా, సీఎల్పీ నేతగా ఎన్నికైన వ్యక్తి ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం హైదరాబాద్ లోని హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. సీఎల్పీ మీటింగ్ లో ఏకవాక్య తీర్మానం చేయనున్నట్లు సమాచారం. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని ఆమోదిస్తామంటూ తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది.