తెలంగాణలో ప్రభావం చూపని బీఎస్పీ
- 108 చోట్ల పోటీ చేసినా ఒక్క సీటూ గెల్చుకోలేకపోయిన బీఎస్పీ
- సిర్పూర్ లో మూడో స్థానానికే పరిమితమైన రాష్ట్ర చీఫ్
- చాలా చోట్ల అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కని వైనం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 108 చోట్ల పోటిచేసినా.. కనీసం ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గంలో పోటీచేయగా.. ఫలితాల్లో మూడో స్థానానికే పరిమితమయ్యారు. దళితుల ఓటు బ్యాంకును సొంతం చేసుకుంటుందని ప్రచారం జరిగినా ఆ స్థాయిలో ఓట్లు రాబట్టుకోలేకపోయింది. చాలాచోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు.
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి 1.35 శాతం ఓట్లు పోలవగా.. 2018 లో ఓట్ షేర్ 2.07 శాతానికి పెరిగింది. గతంలో ప్రధాన పార్టీల టికెట్ దక్కని అభ్యర్థులు బీఎస్పీ టికెట్ పై పోటీ చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఈసారి మాత్రం ఇవేవీ పనిచేయలేదు. ఓట్ షేర్ కూడా 1.40 శాతానికి పడిపోయింది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ గా సుదీర్ఘకాలం గురుకులాల సెక్రటరీగా కొనసాగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రమంతటా పాదయాత్ర చేశారు. అయినా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారు.