మిచౌంగ్ తుపాను.. ఏపీలో వర్షాలు!
- మిచౌంగ్ తుపానుతో ఏపీలో మారిన వాతావరణ పరిస్థితులు
- కాకినాడలో పలు ప్రాంతాల్లో వర్షాలు
- కంట్రోల్ రూంలో, పునరావాస కేంద్రాల ఏర్పాటు
మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీలో వాతావరణం మారింది. కాకినాడలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో ఏడు తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వేటను నిలిపివేయాలని మత్స్యకారులను అధికారులు ఆదేశించారు. వరి కోతలు మానుకోవాలని రైతులకూ సూచించారు. మరోవైపు, ఆఫ్‌లైన్ ద్వారా యుద్ధ ప్రాతిపదికన 16 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఉప్పాడ జడ్పీ హైస్కూల్‌లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటూ హోప్ ఐలాండ్ మత్స్యకారులను తరలించారు.
కాగా, జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు తుపాను పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కాకినాడ, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూంలను కూడా ఏర్పాటు చేశారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు.. కలెక్టరేట్: 18004253077, కాకినాడ ఆర్డీవో కార్యాలయం: 9701579666, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం: 9949393805.
ఇదిలావుంచితే, నేడు కృష్ణా జిల్లాలో అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షనూ వాయిదా వేసింది. ఎన్టీఆర్ జిల్లాలో నేడు, రేపు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.