అత్యధిక మెజార్టీ వివేకానందదే.. రెండో స్థానంలో హరీశ్ రావు

  • 85 వేలకు పైగా ఓట్లతో గెలిచిన వివేకానంద గౌడ్
  • సిద్దిపేట నుంచి 82 వేలకు పైగా ఓట్లతో గెలిచిన హరీశ్ రావు
  • కూకట్ పల్లి నుంచి 70 వేలకు పైగా ఓట్లతో గెలిచిన మాధవరం కృష్ణారావు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఇతరులు ఎనిమిది చోట్ల గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ సిద్దిపేట నుంచి హరీశ్ రావుది లేదా సిరిసిల్లలో కేటీఆర్‌ది అవుతుందని చాలామంది భావించారు. కానీ కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిచారు. వివేకానంద తన సమీప బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై 85,576 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఆ తర్వాత సిద్దిపేట నుంచి హరీశ్ రావు 82,308 ఓట్లు, కూకట్ పల్లి నుంచి మాధవరం కృష్ణారావు 70,387 ఓట్లు, నకిరేకల్ నుంచి వేముల వీరేశం 68,838, మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు 66,116, నాగార్జున సాగర్ నుంచి కుందూరు జైవీర్ రెడ్డి 55,849, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 54,332 ఓట్లతో విజయం సాధించారు.


More Telugu News