తెలంగాణ కొత్త డీజీపీగా రవి గుప్తా

  • అంజనీ కుమార్‌పై ఈసీ సస్పెన్షన్ వేటు వేయడంతో కొత్త డీజీపీ ప్రకటన
  • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న రవి గుప్తా
ఎన్నికల కోడ్ అతిక్రమించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీని నియమించింది. రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి రవి గుప్తా పేరుని ప్రకటించింది. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతోపాటు  ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతున్నారు. ఆయన 1990వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.

ఇదిలావుండగా కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా దూసుకెళ్తున్న సమయంలో డీజీపీ అంజనీ కుమార్ వెళ్లి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడం వివాదాస్పదంగా మారింది. పుష్ఫగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలపడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎన్నికల కోడ్‌ను అతిక్రమించడంతో అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. డీజీపీ అంజనీకుమార్‌‌తోపాటు ఆయన వెంట ఉన్న అదనపు డీజీలు సందీప్‌కుమార్‌ జైన్‌, మహేశ్‌భగవత్‌‌లను ఎన్నికల సంఘం వివరణ కోరింది.


More Telugu News