కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి
- సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్
- కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్
- ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని కేసీఆర్ ను కోరిన గవర్నర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మొత్తం 119 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, బీఆర్ఎస్ కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో, సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆయన రాజీనామాను ఆమోదించారు. అయితే, కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పడనందున ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆమె కేసీఆర్ ను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరేంత వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో బాధ్యతలు నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, రాజీనామా లేఖను పంపిన అనంతరం సీఎం కేసీఆర్ యర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రానికి బయల్దేరినట్టు తెలుస్తోంది.