కొల్లాపూర్ లో జూపల్లి జోరు... బర్రెలక్క ఓటమి
- కొల్లాపూర్ నియోజకవర్గంపై అందరి దృష్టి
- అందుకు కారణం... బర్రెలక్క
- ఇండిపెండెంట్ గా బరిలో దిగిన బర్రెలక్క
- బర్రెలక్కకు నాలుగో స్థానం
కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ఘనవిజయం సాధించారు. వాస్తవానికి జూపల్లి విజయం కంటే బర్రెలక్క పరాజయం గురించే నెటిజన్లు ఎక్కువగా చర్చించుకుంటున్నారు.
కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుంచే బరిలో దిగింది. ప్రచారం సమయంలో మిగతా అభ్యర్థుల కంటే హైప్ లభించినా, దాన్ని ఓట్ల రూపంలోకి మలుచుకోవడంలో బర్రెలక్క విఫలమైంది. బర్రెలక్కకు 5,754 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఈల గుర్తుపై ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలక్క మొత్తమ్మీద నాలుగో స్థానంలో నిలిచింది.
కాగా, కొల్లాపూర్ స్థానంలో విజేతగా నిలిచిన జూపల్లి కృష్ణారావు 28,931 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిపై నెగ్గారు. జూపల్లికి 93,609 ఓట్లు లభించగా... బీఆర్ఎస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డికి 63,678 ఓట్లు లభించాయి. మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి సుధాకర్ రావుకు 20,389 ఓట్లు పడ్డాయి.