'చార్మినార్' ను గెలుచుకున్న ఎంఐఎం

'చార్మినార్' ను గెలుచుకున్న ఎంఐఎం
  • పాతబస్తీలో ఎంఐఎం బోణీ
  • చార్మినార్ నియోజకవర్గంలో మీర్ జుల్ఫికర్ అలీ గెలుపు
  • రెండో స్థానానికి పరిమితమైన బీజేపీ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్
హైదరాబాదు పాతబస్తీలో ఎంఐఎం బోణీ కొట్టింది. చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫికర్ అలీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్ రెండో స్థానానికి పరిమితం అయ్యారు. తొలుత కొన్ని రౌండ్ల పాటు  మేఘా రాణి ముందంజలో నిలిచినా అది తాత్కాలికమే అయింది. 

ఇక, మలక్ పేట, చాంద్రాయణగుట్ట, బహుదూర్ పురా నియోజకవర్గాల్లోనూ ఎంఐఎం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అదే సమయంలో మూడు సిట్టింగ్ స్థానాల్లో ఎంఐఎం వెనుకంజలో ఉండడం ఆ పార్టీ  నాయకత్వాన్ని కలవరపెడుతోంది.


More Telugu News