ఛత్తీస్ గఢ్ లో అంచనాలు తలకిందులు

  • స్పష్టమైన మెజారిటీ దిశగా బీజేపీ
  • కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిన ఎగ్జిట్ పోల్స్
  • ఫలితాల్లో భిన్నమైన ట్రెండ్
ఛత్తీస్ గఢ్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ ఆధిక్యంలో దూసుకెళుతోంది. ఆ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చే ట్రెండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ ను దాటి బీజేపీ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల సంఖ్యల 90 కాగా ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులు 57 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ 31 స్థానాల్లో, ఇతరులు 2 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 71 స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ కేవలం 14 సీట్లతో సరిపెట్టుకుంది. 

మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం చూపినప్పటికీ తర్వాత వెనకబడింది. అంబికాపూర్ నుంచి పోటీ చేసిన ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో లీడ్ లో ఉండగా సీఎం భూపేశ్ భాఘెల్ వెనకంజలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 90 మంది రిటర్నింగ్ అధికారులు, 416 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 1,698 మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో ఉన్నారు. మొత్తం 1,181 మంది అభ్యర్థులు బరిలో నిలువగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.


More Telugu News