తొలి రౌండ్ లో లీడ్ లో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..!
- పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాక 20 చోట్ల బీఆర్ఎస్ ముందంజ
- సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీశ్ రావు
- బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు వెనకబడ్డారు. చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతుండగా.. తర్వాతి స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ముగిసే సరికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 20 చోట్ల మాత్రమే అధికార పార్టీ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్, సిద్దిపేటలో హరీశ్ రావు, బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎల్‌బీనగర్‌లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి 780 ఓట్లతో లీడ్ లో కొనసాగుతుండగా.. కోరుట్లలో కల్వకుంట్ల సంజయ్ 371, ఖైరతాబాద్‌లో 471, వికారాబాద్‌లో ఆనంద్ 605, ముషీరాబాద్‌లో 1202, అంబర్‌పేటలో కాలేరు వెంకటేశ్ 485, సికింద్రాబాద్‌లో పద్మారావు 3,931, మక్తల్‌లో చిట్టెం రామ్మోహన్ రెడ్డి 289, స్టేషన్ ఘన్‌పూర్‌లో 441, జుక్కల్‌లో 723, బాల్కొండలో వేముల ప్రశాంత్ రెడ్డి 157, హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి 1,061, వనపర్తిలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 717 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.