ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న ఫలితాలు.. కేసీఆర్‌పై కొనసాగుతున్న రేవంత్‌రెడ్డి ఆధిక్యం
- పాలేరులో పొంగులేటికి 2,230 ఓట్ల ఆధిక్యం
- మధిరలో భట్టి విక్రమార్కకు 2,198 ఓట్ల తొలి రౌండ్ లీడ్
- బెల్లంపల్లిలో గడ్డం వినోద్‌కు 2,160 ఓట్ల ఆధిక్యం
- చార్మినార్‌లో ముందంజలో బీజేపీ అభ్యర్థి
- స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరికి 400 ఓట్ల ఆధిక్యం
తెలంగాణలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. రెండో రౌండ్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు దూకుడుగా ఉన్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై బరిలోకి దిగిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రెండో రౌండ్‌లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ 2,230 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా, బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్‌కు 2,160 ఓట్ల తొలి రౌండ్ ఆధిక్యం లభించింది. ములుగులో సీతక్క ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మధిరలో భట్టి విక్రమార్కకు తొలి రౌండ్‌లో 2,198 ఓట్ల ఆధిక్యం లభించింది. సత్తుపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటవీరయ్యకు 418 ఓట్ల ఆధిక్యం లభించింది. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు 605, మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మురళీనాయక్ 1,750 ఓట్లతో ముందంజలో ఉన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి 400 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, చార్మినార్‌లో బీజేపీ అభ్యర్థి 2,539 ఓట్ల ఆధిక్యం కొనసాగుతున్నారు. బెల్లంపల్లిలో తొలి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ 2,160 ఓట్ల ఆధిక్యం సంపాదించారు. మొత్తంగా ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ 41, బీఆర్ఎస్ 15, బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.