నిజమయ్యేలా ఉన్న ఎగ్జిట్ పోల్స్.. అంచనాలకు మించి అధిక్యంలో కాంగ్రెస్

  • మునుగోడులో రెండో రౌండ్‌లో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డికి 2 వేల ఓట్ల ఆధిక్యం
  • హుజూర్‌నగర్‌లో తొలి రౌండ్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 2,380 ఓట్ల ఆధిక్యం 
ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేలా ఉన్నాయి. అంచనాలకు మించి కాంగ్రెస్ అభ్యర్థులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఏకమొత్తంగా కాంగ్రెస్ లీడింగ్‌లో ఉంది. కామారెడ్డిలో వెనకబడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్‌లో మాత్రం లీడింగ్‌లో ఉన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి, జుక్కల్‌లో షిండే, శేరిలింగంపల్లిలో గాంధీ లీడింగ్‌లో ఉన్నారు. మిగతా చోట్ల మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు. 

మునుగోడులో రెండో రౌండ్‌ ముగిసే సరికి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి 2 వేల ఓట్ల ముందంజలో ఉన్నారు. నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉండగా, కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని ముందంజలో ఉన్నారు. దేవరకద్రలోనూ కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డి, బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్, హుస్నాబాద్‌‌లో పొన్నం ప్రభాకర్, జగిత్యాలలో జీవన్‌రెడ్డి, హుజూర్‌నగర్‌లో తొలి రౌండ్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2,380 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి సామేలు ముందంజలో ఉన్నారు.


More Telugu News