చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ.. సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు దూరం!
- గాయం మైదానంలో అయింది కాకపోవచ్చంటున్న బీసీసీఐ వర్గాలు
- కన్సల్టేషన్ కోసం ముంబైలో వాలిపోయిన షమీ
- అనంతరం పునరావాసం కోసం బెంగళూరుకు
చీలమండ గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ మహ్మద్ షమీ ముంబైలో చికిత్స తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. స్పోర్ట్స్ ఆర్థోపెడిక్‌ను సంప్రదించేందుకు 33 ఏళ్ల షమీ ప్రస్తుతం ముంబైలోనే ఉన్నాడు. ఈ గాయం అతడికి మైదానంలో అయి ఉండకపోవచ్చని, వైద్యులను కలిసేందుకు అతడు ముంబై వచ్చాడని, ఆ తర్వాత పునరావాసం కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్తాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
సౌతాఫ్రికాతో ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం షమీని సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే, బాక్సింగ్ డే టెస్టుకు అతడు అందుబాటులో ఉండే అవకాశం తక్కువేనని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో షమీ అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. కేవలం 7 మ్యాచుల్లోనే 10.70 సగటుతో ఏకంగా 24 వికెట్లు పడగొట్టి పలు రికార్డులు కొల్లగొట్టాడు.