తెలంగాణ ఎన్నికలపై ఇండియా టుడే ఎగ్జిట్ పోల్... వివరాలు ఇవిగో!
- నవంబరు 30న తెలంగాణ ఎన్నికల పోలింగ్
- డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు
- ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ జోరు
- ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వేలోనూ కాంగ్రెస్ హవా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మరో ఎగ్జిట్ పోల్ సర్వే వెలువడింది. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలోనూ కాంగ్రెస్ హవా కనిపించింది.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తాజా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ 42 శాతం ఓట్ షేర్ తో 63 నుంచి 73 సీట్ల వరకు కైవసం చేసుకోవచ్చని, స్పష్టంగా చెప్పాలంటే 68 సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయని వివరించింది.
అదే సమయంలో, అధికార బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. బీఆర్ఎస్ ఓట్ షేర్ 36 శాతం అని తెలిపింది. బీజేపీకి 4 నుంచి 8 స్థానాలు.... ఇతరులు 5 నుంచి 8 స్థానాలు దక్కించుకోవచ్చని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది.
నవంబరు 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగ్గా... డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
కాగా, ఎన్నికల సరళిపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ... తన అంచనా ప్రకారం కాంగ్రెస్ కు 80కి పైగా స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.